
- ఇక సామాన్యుల పరిస్థితేంటి?: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్
హైదరాబాద్, వెలుగు: అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెస్పాండ్ కావట్లేదని కాంగ్రెస్ కు చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. రంగనాథ్ ఎమ్మెల్యేల ఫోన్ లకే స్పందించకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై తాను హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. దీనిపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. నిబంధనలను అడ్డంపెట్టుకొని కొన్ని ప్రాజెక్టులకు హైడ్రా నోటీసులిచ్చి, తర్వాత లావాదేవీలు నడుపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.