చెరువులు కబ్జా, కలుషితం కాకుండా చూస్తం: హైడ్రా కమిషనర్​ ఏవీ రంగనాథ్ ​

  • గ్రేటర్​లోని పలు చెరువుల పరిశీలన 

హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల, వెలుగు: గ్రేటర్​పరిధిలోని పలు చెరువులను హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్ బుధవారం పరిశీలించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో నిజాంపేటలోని నిజాం తలాబ్ లేక్(తుర్కచెరువు), మాదాపూర్ లోని మేడికుంట చెరువు, ఈదులకుంట, నార్సింగిలోని నెక్నాంపూర్ చెరువు, తెల్లాపూర్​లోని వనం చెరువు, చెల్లికుంట, మేళ్లచెరువులను సందర్శించారు. 

బ్యూటిఫికేషన్​పేరుతో బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు కమిషనర్​దృష్టికి తీసుకొచ్చారు. గేటెడ్ కమ్యూనిటీల నుంచి నేరుగా మురుగు వచ్చి చేరుతోందని వాపోయారు. చెరువులు కబ్జా, కలుషితం కాకుండా చూస్తామని రంగనాథ్​హామీ ఇచ్చారు. చెరువుల పూర్తి వివరాలు సేకరించి కబ్జా కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.