ప్రభుత్వ ఆస్తుల్ని హైడ్రా రక్షిస్తుంది: హైడ్రా కమిషనర్​​ రంగనాథ్​

  •  రేగులకుంట, భక్షికుంట చెరువులను పరిశీలించిన  హైడ్రా కమిషనర్​​రంగనాథ్​ 

 హైదరాబాద్:  సిటీ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేందుకు హైడ్రా పనిచేస్తుందని కమిషనర్ రంగనాథ్​ అన్నారు.  సిటీలోని పలు చెరువుల కజ్జాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు.  ఈ క్రమంలో మియాపూర్ లోని చందానగర్​డివిజన్​పరిధిలోని భక్షికుంట,​ రేగులకుంట చెరువులను రంగనాథ్​ పరిశీలించారు.  స్థానికులతో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికులు అందించిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

చెరువులు కజ్జా కాకుండా చూస్తామని.. చెరువు స్థలాలతో పాటు, వివిధ కాలనీల్లో పార్కుల కోసం ఇతర ప్రజా అసవరాల కోసం కేటాయించిన స్థలాలను హైడ్రా కాపాడుతుందని అన్నారు.రేగులకుంట చెరువు స్థలాన్ని హైడ్రా కాపాడుతుంది.  ఇప్పటీకే స్థానిక అధికారులు ఆదేశిస్తున్నాం.  తక్కువ ఖర్చుతో రెండు చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం.  చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా ఇతర మార్గాలను పరిశీలించాం.  ఈ రెండు చెరువులతో పాటు నగరంలో 10 చెరువులను మొదటి దశలో అభివృద్ధి చేస్తాం.’ అని రంగనాథ్​ అన్నారు.