ఆధారాలు ఉంటే ACB దగ్గరికెళ్లండి.. ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలకు హైడ్రా కమిషనర్​రంగనాథ్ క్లారిటీ

ఆధారాలు ఉంటే ACB దగ్గరికెళ్లండి.. ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలకు హైడ్రా కమిషనర్​రంగనాథ్ క్లారిటీ

హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్​ఫోన్ చేసినా రెస్పాండ్ కారని.. ముందు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత హైడ్రా సెటిల్మెంట్లు చేస్తోందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాపై అధికార పార్టీ ఎమ్మెల్యే విమర్శలు చేయడం పొలిటికల్ సర్కిల్స్‎లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం (మార్చి 18) వివరణ ఇచ్చారు. వంశీరాం మ్యాన్ హట్టన్‎ కంపెనీపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని.. ఆయన కేవలం ఖాజగూడలోని తౌతోని కుంట, భగీరథమ్మ చెరువుల గురించి మాత్రమే గతేడాది ఫిర్యాదు చేశారని క్లారిటీ ఇచ్చారు. 

ALSO READ | ఇంట్రెస్ట్‎కు రూ.5 లక్షలు తీసుకున్న యువకుడు.. గ్యాంగ్‎తో కలిసి కిడ్నాప్​చేసిన ఫైనాన్సర్​

ఫోన్ కాల్‎కు రెస్పాండ్ కాకపోయిన.. ఏవైనా ఫిర్యాదులు చేయాల్సి ఉంటే  వాట్సాప్ మేసేజ్ చేసినా స్పందిస్తామని చెప్పారు. అలాగే.. ప్రజాప్రతినిధులు చేసే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చి హైడ్రా లావాదేవీలు చేస్తోందని ఆరోపించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. అందుకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే పోలీసులు, విజిలెన్స్ లేదా ఏసీబీ దృష్టికి తీసుకెళ్లవచ్చని అన్నారు. నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.