- 200 ఎకరాల లే ఔట్ చుట్టూ ఎత్తైన ప్రహరీ
- రోడ్లు, డ్రైనేజీల కోసం రూ. 10 కోట్ల వసూలు
- ప్లాట్లు అమ్మాలనుకునే వాళ్లను కంట్రోల్ చేస్తుండు
- నారపల్లిలో కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ
హైదరాబాద్: నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్లు కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు పిర్యాదులు వచ్చాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. దీప్తి శ్రీనగర్ లో 200 ఎకరాల లే అవుట్ ను నల్ల మల్లారెడ్డి డెవలప్ చేశారని చెప్పారు. 2,200 ప్లాట్లను సింగరేణి ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేశారని అన్నారు. ఒప్పందం ప్రకారం ఆయన డ్రైనేజీ, రోడ్లు ఏర్పాటు చయాల్సి ఉందని కానీ ఇందుకోసం అదనంగా రూ. 10 కోట్లు వసూలు చేశారని చెప్పారు. సెక్యూరిటీ పేరుతో 200 ఎకరాల లే అవుట్ చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాల్ ను నిర్మించారని అన్నారు.
Also Read : జనవరి 26న మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు స్కీంలు ప్రారంభం
ఈ లేఅవుట్ కు కేవలం ఎంట్రీ, ఎగ్జిట్ లను మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఈ ప్రాంతాన్ని మాఫియా డాన్ లాగా నల్ల మల్లా రెడ్డి నియంత్రిస్తున్నారని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారని చెప్పారు. కాంపౌండ్ హాల్ నిర్మాణానికి సంబంధిత అధికారి నుంచి అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఈ 4 కి.మీ కాంపౌండ్ వాల్ కారణంగా పొరుగు కాలనీలు, గ్రామాలు రోడ్లకు వెళ్లే మార్గం తెగిపోయిందని చెప్పారు. హైడ్రా అన్ని చట్టపరమైన నిబంధనలను అనుసరించి కూల్చివేతలు చేసిందని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.