
హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులపై కమిషనర్ దృష్టి పెట్టారు. గాజులరామారం క్వారీపై కొంతమంది హైడ్రాకు ఫిర్యాదు చేశారు. క్వారీ లీజు ముగిసినా.. స్థలాన్ని ఖాళీ చేయకుండా కొంతమంది కబ్జాకు ప్రయత్నిస్తున్నారని వచ్చిన ఫిర్యాదును హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో విచారించారు. దీని పక్కనే కబ్జాలో ఉన్న స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థలాలను కూడా పరిశీలించారు. 400 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి మండలం నల్లగండల చెరువునాలాలో పోసిన మట్టిని తొలగించాలని వెర్టెక్స్ నిర్మాణ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా గోపన్నపల్లిలో మేల్లకుంట, పుప్పాల గూడలోని మామసాని కుంటలు కబ్జాకు గురయ్యాయని కంప్లెయింట్ రావడంతో వాటిని కూడా పరిశీలించారు..