హైడ్రా కీలక ఆదేశాలు.. వాటిని మార్చి 9 వరకు తీసేయండి

హైడ్రా కీలక  ఆదేశాలు.. వాటిని మార్చి 9 వరకు  తీసేయండి

 అక్రమ నిర్మాణాలు, చెరువులు, నాలాల కబ్జాపై ఫోకస్ పెట్టిన హైడ్రా..గత కొన్ని రోజులుగా అడ్వర్టైజ్ మెంట్  హోర్డింగ్స్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. శివారు మున్సిపాలిటీ పరిధిలో  ఇప్పటికే 50 కి పైగా హోర్డింగ్స్ ను  హైడ్రా సిబ్బంది తొలగించింది. అయితే  లేటెస్ట్ గా  హైదరాబాద్ లోని  భారీ హోర్డింగ్స్ పై  మార్చి 3న  హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక సమావేశం నిర్వహించారు.  యాడ్ ఏజెన్సీ ప్రతినిధులతో  భేటీ అయిన  హైడ్రా కమీషనర్ రంగనాథ్  అనుమతులు లేని అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్ లకు డెడ్ లైన్ విధించారు.

ALSO READ | హైదరాబాద్‎లో బ్యాంకులు, ఏటీఎంల దగ్గర భద్రత పెంచాలి: రాచకొండ సీపీ అలర్ట్

 మార్చి 9  లోపు  ఏజెన్సీలు హైదరాబాద్ లో   స్వయంగా అనుమతి లేని హోర్డింగులను  తొలగించాలని ఆదేశించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.  లేకుంటే నిబంధనలు ఉల్లంఘించిన హోర్డింగులను హైడ్రా తొలగిస్తుందని హెచ్చరించారు   కమిషనర్ రంగనాథ్. అక్రమ హోర్డింగుల తొల‌గింపులో ఎలాంటి మిన‌హాయింపులు ఉండవన్నారు.  హోర్డింగ్ ల ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నా .. అక్రమ హార్డింగ్ లు పెట్టడంతో కేవలం రూ. 20 నుంచి 30 కోట్లు మాత్రమే వస్తుందన్నారు కమిషనర్ రంగనాథ్. 

ఇప్పటికే హైదరాబాద్ లో ప్రభుత్వ స్థలాలు కబ్జాలు.. ఆక్రమణలపై  2025 జనవరి నుంచి ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా కమిషనర్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి ఆక్రమణలు నిజమైతే కూల్చివేతలు చేపడుతున్నారు.