Hydra: రంగనాథ్ మరో కీలక సమావేశం.. హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అవే..

Hydra:  రంగనాథ్ మరో కీలక సమావేశం.. హైడ్రా నెక్ట్స్  టార్గెట్ అవే..

నాలాల పరిరక్షణతో పాటు చెరువుల పరిస్థితిపై   హైడ్రా ఆఫీసులో  వాటర్‌ ఉమెన్  రైట్స్ యాక్టివిస్ట్ మ‌న్సీబాల్ భార్గవతో హైడ్రా కమీషనర్ రంగనాథ్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ లో  చెరువుల ప‌రిస్థితిపై స‌మీక్షించారు.  వాటికి పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు తీసుకుంటున్న చ‌ర్యలను వివరించారు రంగనాథ్.  ఈ సందర్బంగా హైడ్రా చర్యలపై మన్సీబాల్ భార్గవ హర్షం వ్యక్తం చేశారు.  చెరువుల పునరుద్ధరతోనే న‌గ‌రానికి వ‌ర‌ద‌ముప్పు త‌ప్పుతుందంటూ మ‌న్సీబాల్ భార్గవ సూచించారు. త‌క్కువ ఖ‌ర్చుతో చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం కల్పించే విధానాలపై ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్‌ ఇచ్చారు. 

ALSO READ | హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన రియల్ ఎస్టేట్ కంపెనీ

శ‌రీరానికి నాడీ వ్యవస్థ ఎంత ముఖ్యమో చెరువుల‌కు నాలా వ్యవస్థ అంతే అవ‌స‌రమ‌న్న మ‌న్సీబాల్  భార్గవ. భారీ వర్షాలకు సిటీలోని ప్రాంతాలు జలమయం కాకూడ‌దంటే  చెరువుల అనుసంధానం, గొలుసుక‌ట్టు చెరువులు, నాలా వ్యవస్థ స‌రిగా ఉండాల‌ని చెప్పారు మ‌న్సీబాల్  భార్గవ. స‌హ‌జ‌సిద్ధంగా చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం క‌ల్పించే  పద్దతులను వివ‌రించారు .  కాంక్రీట్ క‌ట్టడాలు కాకుండా.. స‌హ‌జ‌సిద్ధంగా చెరువుల‌ను పున‌రుద్ధరించిన‌ప్పడే వాటిలో జీవ‌క‌ళ ఉంటుంద‌ని.. ఆ నీరు జీవ‌రాసుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పారు.