నానక్రామ్ గూడలో హైడ్రా కమిషనర్ చెరువుల పరిశీలన..అక్రమార్కుల్లో గుబులు

నానక్రామ్ గూడలో హైడ్రా కమిషనర్ చెరువుల పరిశీలన..అక్రమార్కుల్లో గుబులు

హైదరాబాద్ నగర పరిధిలోని చెరువుల పునరుద్దరణకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం (మార్చి6) నానక్ రామ్ గూడ పరిధిలోని ఖాజాగూడ పెద్ద చెరువుతోపాటు, నెక్నాంపూర్ లోని ఇబ్రహీంబాగ్ చెరువును రంగనాథ్ పరిశీలించారు. 

ఖాజాగూడ చెరువులోకి మురుగు నీరు చేరకుం డా కాల్వ డైవర్షన్ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.అయితే చెరువుల పరిశీలనకు హైడ్రా కమిషనర్ రావడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది.

మరోవైపు నెక్నాంపూర్ లోని ఇబ్రహీంబాగ్ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్.. చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని దత్తత తీసుకున్న సంస్థను కోరారు. 

Also Read :- SLBC టన్నెల్లో మృతదేహాలను గుర్తించేందుకు క్యడావర్ డాగ్స్

హైదరాబాద్ నగరంలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులు పూర్తయితే ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువుల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సీఎస్ ఆర్ నిధులు అందించాలని కోరారు.