
హైదరాబాద్ సిటీ, వెలుగు: బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్డు బుధవారం ఇచ్చిన తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. కూల్చివేతకు 15 రోజుల ముందు భవన యజమానికి నోటీసులు ఇవ్వాలని, రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపడంతో పాటు నిర్మాణానికి నోటీసులు అంటించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. నీటి వనరులు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు తదితర ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపునకు వర్తించదన్నారు. జీహెచ్ఎంసీ చట్టం–405 ప్రకారం.. రోడ్డు, చెరువులు, నాలాలు తదితర ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపునకు ఎలాంటి నోటీసు జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు.