మా ఇల్లు బఫర్ జోన్​లో లేదు : రంగనాథ్

మా ఇల్లు బఫర్ జోన్​లో లేదు : రంగనాథ్
  • ఫేక్ ​ఇన్ఫర్మేషన్​తో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు: రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: తాను నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్​లో లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాన్ని ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మా నాన్న  నిర్మించిన ఇల్లు బఫర్ జోన్​లో ఉందని సోషల్ మీడియాతో పాటు పలు పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన వారి ఇంటికి సంబంధించిన మ్యాప్​లను మీడియాకు రిలీజ్​చేశారు. ‘‘మధురానగర్ లో మా నాన్న ఏపీవీ సుబ్బయ్య 1980లో ఇంటిని నిర్మించారు. 44 ఏండ్ల క్రితం నిర్మించిన అదే ఇంట్లో మా  తండ్రితో కలిసి నేను ఉంటున్నాను. 

ప్రస్తుత కృష్ణాకాంత్ పార్కు ఉన్న స్థలంలో సుమారు 25 సంవత్సరాల క్రితం ఒక చెరువు ఉండేది. చెరువున్నప్పటి నిబంధనల ప్రకారం అయినా మా ఇల్లు కట్టకు ఒక కిలోమీటరు దూరంలో ఉంది. కృష్ణకాంత్ పార్కు  దిగువున వున్న వేలాది ఇండ్ల తర్వాత మా ఇల్లు ఉంటుంది. సంస్కృతి, సంప్రదాయాలలో భాగంగా చెరువు కట్ట మీద, కట్టను ఆనుకొని కట్ట మైసమ్మ ఆలయాలు నిర్మిస్తారనన్నది అందరికీ తెలుసు. -మా ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలో కట్ట మైసమ్మ గుడి ఉంది.

 ఎక్కడైనా చెరువు కట్ట ఎత్తుపై ఆధారపడి దిగువ భాగంలో 5- నుంచి 10 మీటర్ల వరకు ఉన్న స్థలాన్ని బఫర్ జోన్ గా ఇరిగేషన్ శాఖ పరిగణిస్తుంది. 25 ఏండ్ల క్రితం  పెద్దచెరువు, ప్రస్తుతం కృష్ణకాంత్ పార్కుగా మారిన స్థలం మా నివాసానికి  ఒక కిలోమీటర్  దూరంలో ఉంది. చెరువు కట్టకు దిగువున10 మీటర్లు దాటితే.. కింద ఉన్న  నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావు’’అని రంగనాథ్​ స్పష్టం చేశారు.