హైదరాబాద్ సిటీలో అక్రమ నిర్మాణాలపై మరోసారి స్పందించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 2024, జూలై నెల తర్వాత అక్రమంగా కడుతున్న నిర్మాణాలను కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారాయన. అన్ని అనుమతులు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదని.. అలా కాకుండా చెరువుల్లో.. బఫర్ జోన్లలో.. FTL పరిధిలో చేపడుతున్న నిర్మాణాలను కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్
కూకట్ పల్లిలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 2024 జులై తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమన్నారు. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్నవాటిని కూల్చబోమన్నారు.
పర్మిషన్లు తీసుకోకుండా అక్రమంగా నిర్మించుకున్న భవనాలపై చట్టరీత్య చర్యలు తీసుుకుంటామని హెచ్చరించారు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీలు చేస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తుందన్నారు రంగనాథ్. పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి హైడ్రా వెళ్లబోదన్నారు. పేదవాళ్ల ఇండ్లు హైడ్రా కూల్చివేస్తుందనే తప్పుడు ప్రచారం నమ్మొద్దని చెప్పారు రంగనాథ్.
ప్రతి సోమవారం ప్రజావాణి
హైదరాబాద్ లో చెరువులు, కుంటలు, పార్కుల ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు 2025 జనవరి నుంచి ప్రతి సోమవారం బుద్ధభవన్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది. చెరువులు,నాలాలు, పార్కుల ఆక్రమణలపై అర్జీలు ఇవ్వొచ్చని చెప్పింది హైడ్రా. ఇటీవలే చెరువులు,నాలాలు, పార్కులు కబ్జాకు గురవుతున్నట్లు హైదరాబాద్ లో హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందకు హైడ్రా ఈ నిర్ణయం తీసుకుంది.