హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపిన హైడ్రా ఇప్పుడు శంషాబాద్ పై ఫోకస్ పెట్టింది. శంషాబాద్ పరిధిలోని చారి నగర్ లో కబ్జాలకు గురైన గొల్లవానికుంట ధర్మోజికుంటను సందర్శించారు హైడ్రా కమీషనర్ రంగనాథ్ 23 ఎకరాలు ఉండాల్సిన చెరువు పూర్తిగా 75% కనిపించకుండా పోయిందని.. ఇంత జరుగుతున్న పట్టించుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషనర్ రంగనాథ్.
రెండు మూడు రోజుల్లో పరిశీలించి కబ్జాకు గురైన కుంటలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు కమిషనర్ రంగనాథ్. కబ్జా చేసిన వ్యక్తులకు వెంటనే నోటీసులు అందజేసి అక్రమాలను తొలగించాలని అధికారులకు ఆదేశించారు కమిషనర్. మరో రెండు రోజుల్లో తిరిగి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తానని తెలిపారు.
ధరణి పోర్టల్ లో శంషాబాద్ విలేజ్ పేరు లేకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆశ్చర్యానికి గురైన రంగనాథ్, ఈ అంశాన్ని పరిశీలిస్తానని తెలిపారు. చెరువులు,కుంటలు ఈ స్థాయిలో పూర్తిగా కబ్జాలకు గురైయ్యేంతవరకు అధికారులు తిరిగి చూడకపోవడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాథ్. సరైన చర్యలు తీసుకోకపోతే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు కమిషనర్ రంగనాథ్.