![తుక్కుగూడలోని సూరం చెరువుపై హైడ్రా ఫోకస్.. 60 ఎకరాలు ఉండాల్సింది 25ఎకరాలే మిగిలింది..](https://static.v6velugu.com/uploads/2025/02/hydra-commissioner-ranganath-visits-suram-cheruvu-lake-at-thukkuguda_tU3MIfwOhS.jpg)
హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణకు నడుం బిగించిన హైడ్రా దూకుడు పెంచింది.. తాజాగా మహేశ్వరంలోని తుక్కుగూడ మునిసిపాలిటీలో సూరం చెరువును పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.సూరం చెరువు 60 ఎకరాలకు పైగా ఉండేదని.. ప్రస్తుతం 25 ఎకరాల చెరువు మిగిలిందని అన్నారు కమిషనర్ రంగనాథ్.
సూరం చెరువుకు సంబంధించిన భూమి కబ్జా చేశారని... త్వరలోనే అన్ని శాఖల అధికారులతో సంప్రదించి చర్యలు తీసుకుంటామని తెలిపారు రంగనాథ్. తుక్కుగూడలోని చెరువుల ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు మేరకు సూరం చెరువును పరిశీలించిన కమిషనర్ రంగనాథ్.. సూరం చెరువు కబ్జాదారులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని అన్నారు
ALSO READ | హనుమకొండ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై ఏసీబీ దాడులు