చెరువుల అభివృద్ధికి ముందుకు రావాలి: హైడ్రా

చెరువుల అభివృద్ధికి ముందుకు రావాలి: హైడ్రా

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఔట‌‌ర్ ప‌‌రిధిలోని చెరువుల అభివృద్ధికి కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని హైడ్రా కమిషనర్​రంగనాథ్​పిలుపునిచ్చారు. సీఎస్ఆర్​కింద నిధులు ఇవ్వాలని కోరారు. సీఎస్ఆర్​ఫండ్స్​ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న 72 సంస్థల ప్రతినిధుల‌‌తో బుధ‌‌వారం ఆయన స‌‌మావేశ‌‌మ‌‌య్యారు.

మాదాపూర్‌‌ సున్నం చెరువు, త‌‌మ్మిడికుంట, కూక‌‌ట్‌‌ప‌‌ల్లి న‌‌ల్లచెరువు, ఉప్పల్‌‌ న‌‌ల్ల చెరువు, అంబ‌‌ర్‌‌పేట‌‌ బ‌‌తుక‌‌మ్మకుంట‌‌, పాత‌‌బ‌‌స్తీ బ‌‌మృక్నుద్దీన్ దౌలా చెరువుల‌‌ను అభివృద్ధి చేస్తున్నామ‌‌ని రంగనాథ్​తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలో 1,025 చెరువులు ఉండ‌‌గా 61 శాతం జాడలేవని, ఉన్న 39 శాతం చెరువుల‌‌ను పరిరక్షిస్తున్నామన్నారు.