హైడ్రా దూకుడు : రాయదుర్గంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

హైడ్రా దూకుడు : రాయదుర్గంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

హైడ్రా.. తన దూకుడు చూపిస్తుంది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం ఏరియాలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తుంది. 2024, ఆగస్ట్ 26వ తేదీ తెల్లవారుజామున భారీ ఎత్తున బుల్డోజర్లు ఆ ప్రాంతానికి వెళ్లాయి. 

రాయదుర్గం సర్వే నెంబర్ 3, 4, 5 మొత్తం ప్రభుత్వం స్థలం. అందులో అక్రమంగా శాశ్విత నిర్మాణాలు చేపట్టారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేశారు హైడ్రా అధికారులు. ఈ సందర్భంగా స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో అధికారులు, పోలీసులు వాళ్లను సర్దిచెప్పి ఖాళీ చేయించారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చట్టవిరుద్ధమని వివరిస్తూ.. డాక్యుమెంట్లు చూపిస్తూ.. నిర్మాణాలను నేల మట్టం చేశారు.

 

రాయదుర్గం పరిధిలోని సర్వే నెంబర్లు 3, 4, 5 భూముల్లోని అన్ని నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. అక్కడ ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టారు.