రోడ్డుకు అడ్డంగా భారీ గోడ, షెడ్డులు.. కూల్చేసిన హైడ్రా

రోడ్డుకు అడ్డంగా భారీ గోడ, షెడ్డులు.. కూల్చేసిన హైడ్రా

హైదరాబాద్ లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల పని పడుతోంది.  ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఇటీవల హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో భారీగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టడాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా రంగారెడ్డి జిల్లా  గండిపేట్ మండలానికి చెందిన నెకనాంపూర్ గ్రామంలో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది.

ఏప్రిల్ 29న నెకనాంపూర్ విలేజీలో రోడ్డుపై అక్రమంగా నిర్మించిన షెడ్డులను కూల్చేసింది హైడ్రా . గోడ తొలగించడంతో వేంక‌టేశ్వర కాల‌నీకి, ఉస్మానియా కాల‌నీకి మ‌ధ్య  మార్గం సుగుమమైంది.  అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. క్షేత్ర స్థాయిలో పర్యటించిన  వెంట‌నే ఈ అడ్డుగోడ‌ను తొల‌గించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు  హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాథ్.  కమిషనర్ ఆదేశాల మేర‌కు అడ్డుగోడ తో పాటు అక్రమంగా కట్టిన షెడ్డులను తొలగించారు.

►ALSO READ | భూదాన్ భూముల స్కాం: ఈడీ సీజ్ చేసిన 45 వింటేజ్ కార్లు ఇవే..

హైడ్రా కూల్చివేతలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాలను కూల్చి వేయడాన్ని సమర్థించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రాతో చెరువులు, భూములు పరిరక్షిస్తుందనే నమ్మకం కలిగిందన్నారు.