ఆక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. గ్రేటర్ వ్యాప్తంగా చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఏ ఒక్కరిని వదలడం లేదు. బుల్డోజర్లతో గంటల్లోనే భారీ బిల్డింగులను సైతం నేలమట్టం చేస్తోంది. ఆక్రమణ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. చెరువులను కబ్జాలు చేసి కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకుంటా అంటే కుదరదని హెచ్చరించారు. స్టే లు తెచ్చుకునే టైం కూడా ఇవ్వబోమని చెప్పారు. ఆక్రమణ నిర్మాణాలను 2-3 గంటల్లో కూల్చేస్తామన్నారు. ఏవరు ఏంటి అని తెలుసుకుని కూల్చివేతకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మియాపూర్, శేర్లింగంపల్లి, మదీనగూడ ,నిజాంపేట పరిధిలో పలు ఆక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. చెరువుల FTL, బఫర్ జోన్స్ లో నిర్మాణాలు చేపట్టిన వారిపై మియాపూర్ పీఎస్ లో FIR నమోదు చేశారు. ఈ మేరకు వైశాలీ నగర్ ఈర్ల చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టారని స్వర్ణలత, కృష్ణ కిషోర్ల పై కంప్లైంట్ చేశారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఈ అపార్ట్ మెంట్ లను హైడ్రా అధికారులు గంటల్లోనే నేలమట్టం చేశారు. నిజాంపేట్ ఎర్రకుంటలో అక్రమ నిర్మాణాలు చేపట్టాడని మ్యాప్స్ ఇన్ఫ్రా ఎండి సుధాకర్ రెడ్డిపై ఇరిగేషన్ శాఖ అధికారులు బాచుపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.ఈ నిర్మాణాలను ఇప్పటికే కూల్చేశారు హైడ్రా అధికారులు.
ALSO READ | హైడ్రా ఎఫెక్ట్.. ఆరుగురు అధికారులపై కేసులు నమోదు
మరో వైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని సాకి చెరువును పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇప్పటికే చెరువులో 18 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. సామాన్య ప్రజలు నిర్మించుకున్న ఇండ్ల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు కమిషనర్ రంగనాథ్