హైదరాబాద్ సిటీలో బాక్స్ క్రికెట్ కోర్టు కూల్చేసిన హైడ్రా

హైదరాబాద్ సిటీలో బాక్స్  క్రికెట్ కోర్టు కూల్చేసిన హైడ్రా

స్థానికుల ఫిర్యాదులో హైదరాబాద్ లో  అక్రమాల అంతు చూస్తోంది హైడ్రా.  లేటెస్ట్ గా బడంగ్ పేట్  మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోయపల్లి ఎన్ క్లివ్  లో రోడ్డుని ఆక్రమించి కట్టిన బాక్స్ క్రికెట్ కోర్ట్ ను కూల్చివేసింది హైడ్రా. కూల్చివేతలను  అడ్డుకున్న వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు. 

కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన హైడ్రా..రోడ్డు స్థలాన్ని ఆక్రమించి బాక్స్ క్రికెట్ కోర్టును కట్టినట్లు గుర్తించారు. మార్చి 27న ఉదయం జేసీబీల సాయంతో క్రికెట్ కోర్టును కూల్చివేశారు హైడ్రా అధికారులు.ఫిర్యాదు చేయగానే స్పందించి అక్రమాలను కూల్చివేసినందుకు  హైడ్రాకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు కాలనీ వాసులు. 

ప్రతి సోమవారం బుద్ధభవన్లో ప్రజావాణి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఉద‌‌యం 11 గంట‌‌ల నుంచి రాత్రి 7.30 గంట‌‌ల వ‌‌ర‌‌కు క‌‌మిష‌‌న‌‌ర్ ఏవీ రంగ‌‌నాథ్‌‌ ప్రజ‌‌ల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. 2025 జనవరి నుంచి ప్రారంభించిన ఈ ప్రజావాణికి  హైదరాబాద్ ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది.