మల్కాజ్గిరిలో పార్కు ఆక్రమణలపై హైడ్రా కొరడా..

మల్కాజ్గిరిలో పార్కు ఆక్రమణలపై  హైడ్రా కొరడా..

హైద్రాబాద్ లో హైడ్రా మరో సారి కొరడా ఝులిపించింది. అక్రమ కట్టడాలు నిర్మించారనే సమాచారంతో  మల్కాజ్గిరి నియోజకవర్గంలో పార్క్ ను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాను కూల్చి వేసింది. స్థానికుల సమాచారం మేరకు బుధవారం (1 జనవరి 2015) అక్రమ కట్టడాలను కూల్చి వేసింది.

 నేరేడ్ మెట్ డిఫెన్స్ కాలనీ లోని సర్వే నెంబర్ 218/1 లో పార్క్ ఆక్రమించారని కూల్చివేతలు నిర్వహించింది.  డిఫెన్స్ కాలనీ హౌసింగ్ సొసైటీ సభ్యుడు శివయ్య, రాబిన్ జేమ్స్ లు పార్క్ కబ్జా చేశారని పోలీసులకు చేసిన హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. 

Also Read :- రూ.1255 కోట్ల మద్యం తాగేశారు

దీంతో భారీ బందోబస్తు నడుమ పార్కును ఆక్రమించి కట్టిన షెడ్లను జిహెచ్ఎంసి సహాయంతో  హైడ్రా అధికారులు కూల్చివేశారు.