ఘట్ కేసర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా

ఘట్ కేసర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా

హైదరాబాద్ లో పలు చోట్ల హైడ్రా కూల్చివేతలు మొదలు పెట్టింది.  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా  ఘట్ కేసర్ మండలం  నారపల్లిలో నల్ల మల్లారెడ్డి ప్రభుత్వ స్థలం ఆక్రమించి 4.కి.మీ మేర కట్టిన ప్రహరీ గోడను కూల్చివేశారు హైడ్రా అధికారులు. 

 కాచవానిసింగారం , కొర్రెముల గ్రామాల పరిధిలోని సర్వే నంబర్ 44,45,46,47 లకు సంబంధించిన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదులు చేశారు.  నల్ల మల్లారెడ్డి అక్రమంగా గోడ కట్టి కాలనీలో ప్లాట్లు కబ్జా చేశాడని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. తమ సొంత ప్లాట్లు అమ్ముకోవాలన్నా నల్ల మల్లారెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు.

స్థానికుల ఫిర్యాదుతో  హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి..ప్రభుత్వ స్థలం ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించారని తేల్చారు. ఇవాళ జనవరి 25న కూల్చివేశారు.  ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా మూడు వందల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు ...