నార్నే ఎస్టేట్ అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా : 39 ఎకరాలు రక్షించిన అధికారులు

నార్నే ఎస్టేట్ అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా : 39 ఎకరాలు రక్షించిన అధికారులు

 హైదరాబాద్ లో హైడ్రా మళ్లీ దూకుడు  పెంచింది. అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను  కూల్చేస్తుంది.  ఇవాళ (ఏప్రిల్ 19) ఉదయంకొండపూర్ లోని హఫీజ్ పేటలో   ఏపీ ఎమ్మెల్యే  వసంత్ కృష్ణ ప్రసాద్ కట్టిన అక్రమ నిర్మాణాలను  హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. నార్నే ఎస్టేట్ సంస్థ  రాయదుర్గంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా.

ఏప్రిల్ 19న  రాయదుర్గం, దర్గా దగ్గర సర్వే నెంబర్ 5/2 లోని 39 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను కూల్చివేసింది హైడ్రా.  అనుమతిలేని లే ఔట్‌ లో ర‌హ‌దారులు నిర్మిస్తూ  ప్లాట్లు అమ్మకాలు చేపట్టింది నార్నే ఎస్టేట్ సంస్థ. తాము రోజూ క్రికెట్ ఆడుకునే చోట ఆడ‌నివ్వడంలేదని  హైడ్రాకు ఫిర్యాదు చేశారు యువకులు. చెరువును కూడా కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించింది హైడ్రా. దీంతో ఇవాళ ఏప్రిల్ 19న   అక్రమ నిర్మాణాలు తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది హైడ్రా.

Also Read:-ఏపీ టీడీపీ ఎమ్మెల్యేకు హైదరాబాద్ హైడ్రా షాక్ ..