మేడ్చల్ జిల్లా: నాగారం మున్సిపాలిటీ పరిధిలోనీ సిరిపురం కాలనీలో రోడ్డు ఆక్రమణను హైడ్రా అధికారులు కూల్చివేశారు. తమ కాలనీలో రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ స్థానికులు ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు.. రోడ్డు ఆక్రమణ నిజమేనని నిర్ధారించారు.
Also Read :- లంచం పట్టాడు.. ఏసీబీకి చిక్కాడు..
బుధవారం(నవంబర్ 13) ఉదయం సిరిపురం కాలనీకి చేరుకున్న రెండు హైడ్రా బృందాలు జేసిబీ సాయంతో ఆక్రమణలు కూల్చివేశారు. రోడ్డు కబ్జా చేసిన పాపి రెడ్డిపై కూడా చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు వెల్లడించారు.