మాదాపూర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల సంరక్షణే లక్ష్యంగా రంగంలోకి దిగిన హైడ్రా తన దూకుడు కంటిన్యూ చేస్తోంది. సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేకుండా వరుసగా అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపడుతోంది హైడ్రా. తాజాగా మాదాపూర్ లోని అక్రమ నిర్మాణాలను కుల్చివేస్తున్న హైడ్రా అధికారులు. కావురి హిల్స్ పార్క్ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు.

పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేత చేపట్టారు హైడ్రా అధికారులు. కావూరి హిల్స్ పార్క్ లో ఉన్న స్పోర్ట్స్ అకాడమిపై గత కొంతకాలంగా ఫిర్యాదులు అందుతున్న క్రమంలో కూల్చివేత చేపట్టారు అధికారులు.

అక్రమ నిర్మాణాలను తోలగించి కావురిహిల్స్ పార్క్ అని బోర్డు ఎర్పాటు చేశారు అధికారులు. కావురి హిల్స్ అసోషియషన్ నుంచి 25 సంవత్సరాలు తమకు లిజుకు ఇవ్వడం జరిగిందని స్పోర్ట్స్ అకాడమీ నిర్వహకులు ఆరోపిస్తున్నారు.తమ గడువు ముగియక ముందే అన్యాయంగా నిర్మాణాలను తోలగిస్తూన్నరని ఆరోపిస్తున్నారు స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు.