మణికొండలో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్ లోని మణికొండ మున్సిపాలిటీ లో అక్రమంగా వెలసిన నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. శుక్రవారం ( జనవరి 10, 2025 ) మణికొండ పరిధిలోని నెక్నాంపూర్ చెరువును కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు అధికారులు. హైడ్రా కమీషనర్ రంగనాథన్ అదేశాల‌ మేరకు భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు అధికారులు.  

నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లు హైడ్రా కు ఫిర్యాదు చేశారు అధికారులు. స్థానికుల ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించి నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ చెరువును కబ్జా చేసి నిర్మించినట్లుగా గుర్తించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. 

ALSO READ : స్లాబ్‌‌ సెంట్రింగ్‌‌ కూలి ఏడుగురికి గాయాలు

చెరువును పరిశీలించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారించిన హైడ్రా అధికారులు. గురువారం ( జనవరి 9, 2025 ) నెక్నంపూర్ చెరువును పరిశీలించిన హైడ్రా కమీషనర్ రంగనాథ్ కూల్చివేతకు ఆదేశాలిచ్చారు.