హైదరాబాద్ మణికొండలో హైడ్రా కూల్చివేతలు..

హైదరాబాద్ మణికొండలో హైడ్రా కూల్చివేతలు..

హైదరాబాద్ లోని మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. మణికొండలోని బుల్కాపూర్ నాలాను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చేశారు హైడ్రా అధికారులు. హైటెన్షన్ వైర్ల కింద ఉన్న స్థలంతో పాటు నాలను ఆక్రమించి నిర్మించిన రేకుల ప్రహరీని తొలగించారు అధికారులు.

చారిత్రాత్మక బుల్కాపూర్ నాలాను ఓ నిర్మాణ సంస్థ కబ్జా చేసిందని.. స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. ఆక్రమణలపై ఫిర్యాదు అందిన క్రమంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి నాలా కబ్జాకు గురైనట్లు నిర్దారించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కమిషనర్ ఆదేశాల మేరకు ఇవాళ ( మార్చి 15, 2025 ) అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు అధికారులు.

ALSO READ | కోకాపేటలో ఐటీ ఆఫీసులు ఉన్న.. GAR బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్

శంకరపల్లి లోని బుల్కాపూర్ చెరువు నుంచి ఖానాపూర్, కోకాపేట‌, నార్సింగ్‌, పుప్పలగూడ, మ‌ణికొండ, దర్గా, షేకేపేట్, టోలి చౌకి , పోచమ్మ బస్తీ, చింతలబస్తీ మీదుగా హుస్సేన్ సాగ‌ర్‌కు  వర్షపు నీరును తీసుకెళ్లే  బుల్కాపూర్ నాలా పున‌రుద్ధ‌రిస్తే చాలా ప్రాంతాల్లో  భూగ‌ర్భ జ‌లాలు పెరుగుతాయని.. ఈమేరకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు.