మెహదీపట్నంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

మెహదీపట్నంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్ సిటీ, వెలుగు: మెహిదీపట్నం నవోదయ కాలనీలో జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో రెండో రోజు కూల్చివేతలు కొనసాగాయి.  ప్లస్ 3 అనుమతులు తీసుకొని, నాలుగు, ఐదు అక్రమ అంతస్తులు నిర్మించారని  సర్కిల్-12 టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణమూర్తి తెలిపారు. వాటిని గుర్తించి కూల్చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారి నర్సింగరావు తో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు.

అక్రమ గోదామ్​ కూల్చివేత

శామీర్ పేట : తూంకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయాంజాల్లో అనుమతులను తీసుకోకు౦డా నిర్మిస్తున్న గోదామును మున్సిపల్​ అధికారులు కూల్చేశారు. గోదాముపై స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. మున్సిపల్ కమీషనర్ వెంకటగోపాల్ ఆదేశాల మేరకు టీపీఓ మణిహారిక ఆధ్వర్యంలో కూల్చివేశారు. ఎవరైనా  అక్రమ నిర్మాణం చేపడితే సహించేది లేదని హెచ్చరించారు.