ఫిలింనగర్​లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

హైదరాబాద్ సిటీ/జూబ్లీహిల్స్, వెలుగు: ఫిలింనగర్​లోని రోడ్డును ఆక్రమించి ఫిలింనగర్​కో-ఆపరేటివ్​సొసైటీ నిర్వాహకులు నిర్మాణాలు చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు. రోడ్డును ఆక్రమించి ఇంటి ప్రహరీతోపాటు రేకుల షెడ్డు నిర్మించినట్లు గుర్తించారు. శనివారం జేసీబీలతో వాటిని కూల్చివేశారు.

శిథిలాలను వెంటనే అక్కడి నుంచి తొలగించారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. వెంటనే సదరు స్థలంలో రోడ్డు నిర్మించాలని సూచించారు. 15 ఏండ్ల నుంచి ఆక్రమణలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. హైడ్రా చర్యలపై హర్షం వ్యక్తం చేశారు.