హైదరాబాద్ ఖాజాగూడ భగీరథమ్మ చెరువులోని నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కుల్చివేస్తున్నారు హైడ్రా సిబ్బంది . ఖాజాగూడా భగీరధమ్మ చెరువు ఆక్రమమణలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఇటీవలే భగీరథమ్మ చెరువులోని ఆక్రమణలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో డిసెంబర్ 31న బఫర్ జోన్ లో ఏర్పాటు చేసిన షెడ్ లు,ఆక్రమణలను కూల్చివేసింది హైడ్రా.
నాలుగు ఎకరాల్లో ఆక్రమంగా వేసిన ఫెన్సింగ్ తొలగించారు హైడ్రా సిబ్బంది. 20కి పైగా దుకాణాలను తొలగించారు. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగిస్తోంది హైడ్రా.