హయత్ నగర్ కోహెడలో హైడ్రా భారీ కూల్చివేతలు..

హయత్ నగర్ కోహెడలో హైడ్రా భారీ కూల్చివేతలు..

హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా రంగంలోకి దిగిన హైడ్రా దూకుడు పెంచింది..  హైదరాబాద్ లోని హయత్ నగర్ లో భారీ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా.. ఆదివారం ( ఫిబ్రవరి 9, 2025 )హయత్ నగర్ కోహెడలో ప్లాట్లు కబ్జా చేసి నిర్మించిన భారీ ఫామ్ హౌస్ ను కూల్చేశారు హైడ్రా అధికారులు. రియల్టర్ బాల్ రెడ్డి ప్లాట్లు కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు 170 మంది ఫ్లాట్ ఓనర్లు.సర్వే నెంబర్ 951,952 లో 7.28 గుంటల భూమిని కబ్జా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు. 

బాధితుల ఫిర్యాదు మేరకు సంబంధిత సర్వే నంబర్లలో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు.పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. 

ALSO READ | తక్కువ ఖర్చుతో ప్రహరీ కట్టుకోవచ్చు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్ ​వి పాటిల్​