మాదాపూర్ లోని హీరో నాగార్జున కు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. శనివారం ( ఆగస్టు 24, 2024 ) తెల్లవారుజామునే జంబో మెషిన్ లతో కూల్చేశారు హైడ్రా సిబ్బంది.పోలీసులు బందోబస్తు మధ్యలో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు.తిమ్మిడి కుంట కు సంబందించిన బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని అనేక ఫిర్యాదులు రావడం తో కూల్చేస్తున్నట్లు తెలుస్తోంది.
తమ్మిడి చెరువు ఎఫ్టీఎల్పరిధిలో అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ తో పాటు ఇతర కట్టడాలను తొలగించాలని ‘జనం కోసం’ సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రా కమిషర్ రంగనాథ్ కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. అన్ని ఆక్రమణలను తొలగించి 29 ఎకరాల 24 గుంటలకు పైగా ఉన్న చెరువును పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read :- నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేతకు కారణాలివే..
ఒకప్పుడు జనానికి ఆహ్లాదం పంచిన తమ్మిడి చెరువు ఇప్పుడు అన్యాక్రాంతమైందని, ఇందులో హీరో నాగార్జున దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును ఆక్రమించి, ఎన్ కన్వన్షన్ పేరుతో నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో లోకాయుక్త తోపాటు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు.