
హైదరాబాద్: నాంపల్లిలోని ఓ అపార్టుమెంట్ లిఫ్ట్ లో నాలుగేళ్ల బాలుడు చిక్కుకుపోయాడు. లిఫ్ట్లో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డాడు. సమయానికి హైడ్రా DRF బృం దాలు ఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టడంతో బాలుడి ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే..
నాంపల్లిలోని శాంతిగర లోని ఓ అపార్టుమెంట్ లో నాలుగేళ్ల బాలుడు లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు. అపార్టుమెంట్ వాసులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బాలుడిని రక్షించే పనిలో పడ్డారు.
లిఫ్ట్ గ్రిల్ విరగ్గొట్టి.. లిఫ్టులో ఉన్న బాలుడిని ఆక్సిజన్ అందించారు. అనంతరం లిఫ్ట్ గోడను పగులగొట్టి బాలుడిని బయటికి తీశారు DRF సిబ్బంది. వెంటనే బాలుడ్ని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.