హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య క్లియర్ చేయడానికి.. రంగంలోకి హైడ్రా

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య క్లియర్ చేయడానికి.. రంగంలోకి హైడ్రా

విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్‪లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ట్రాఫిక్ విభాగంతో కలిసి హైడ్రా పని చేయాలని నిర్ణయించుకుంది. ఈమేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నాంపల్లిలోని ట్రాఫిక్ అద‌న‌పు క‌మిష‌న‌ర్ ఆఫీస్ లో ట్రాఫిక్ కమిషనర్ విశ్వవరప్రసాద్, ఇతర ట్రాఫిక్ పోలీసులతో కలిసి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి రివ్యూ మీటింగ్ లో చర్చించారు. 

ALSO READ | సపోర్ట్ హైడ్రా.. సేవ్ హైదరాబాద్ ట్యాగ్ లైన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్

డీఆర్ఎఫ్ బృందాలకు ట్రాఫిక్ నియంత్రణపై శిక్షణ ఇప్పించాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది. వర్షం పడ్డప్పుడు వాట‌ర్‌ లాగింగ్ పాయింట్ల వ‌ద్ద నీరు నిల‌వ‌కుండా తీసుకోవాల్సిన చర్యలపై స‌మీక్షించారు. ప్రధాన ర‌హ‌దారుల‌తో పాటు.. కాల‌నీల్లో ఫుట్‌‌పాత్‌‫ల‌ను ఆక్రమించి ఉన్న దుకాణాలను తొల‌గించనున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఫుట్‌‌పాత్లను, ర‌హ‌దారుల‌ను ఆక్రమించి షెడ్లు ఏర్పాటు చేసిన వ్యాపారుల‌కు స‌మాచారం ఇచ్చి వాటిని తొల‌గిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.