ఇప్పటికే ట్రాఫిక్ పై దృష్టి పెట్టిన హైడ్రా ఇపుడు చెట్ల పరిరక్షణపై ఫోకస్ చేసింది. హైదరాబాద్ లో చెట్ల పరిరక్షణతో పాటు ప్రమాదకరంగా మారిన చెట్లకు సంబంధించి హైడ్రా ఆఫీస్ లో రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు జీహెచెఎంసీ, హైడ్రా, అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫారెస్టు విభాగాలతో జోనల్ వారీగా టీమ్స్ ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో చెట్ల స్థితిపై సర్వే చేయాలని నిర్ణయించారు.
ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఎండిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్లను గుర్తించి.. ప్రాణహాని జరగకముందే వాటిని తొలగించాలని సూచించారు. ట్రాఫిక్ కు ఇబ్బందిగా, కూలేందుకు సిద్ధంగా ఉన్న చెట్లను గుర్తించి ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు అధికారులు. కరెంటు తీగలకు.. ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారుతున్న చెట్ల కొమ్మలను ఎప్పటికప్పుడు కట్ చేయాలని చెప్పారు.
ALSO READ | రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణం కూల్చడానికి వెళ్తే.. రాళ్లతో దాడి