చెట్ల ప‌‌‌‌రిర‌‌‌‌క్షణ‌‌‌‌పై హైడ్రా కమిషనర్ సమీక్ష

చెట్ల ప‌‌‌‌రిర‌‌‌‌క్షణ‌‌‌‌పై హైడ్రా కమిషనర్ సమీక్ష

హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్​పరిధిలోని చెట్ల ప‌‌‌‌రిర‌‌‌‌క్షణ‌‌‌‌పై హైడ్రా ఫోకస్​పెట్టింది. క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ ఏవీ రంగ‌‌‌‌నాథ్ ఆధ్వర్యంలో బుధ‌‌‌‌వారం హైడ్రా ఆఫీసులో జీహెచ్ఎంసీ, హైడ్రా, అట‌‌‌‌వీ శాఖ అధికారులు సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫారెస్ట్​అధికారులతో జోన్ల వారీగా టీమ్స్​ఏర్పాటు, చెట్ల స్థితిగతులపై క్షేత్రస్థాయి స‌‌‌‌ర్వే, చెట్ల తొలగింపునకు తీసుకోవాల్సిన చ‌‌‌‌ర్యల‌‌‌‌పై చర్చించారు. ట్రీ  ట్రాన్స్‌‌‌‌ప్లాంటేష‌‌‌‌న్‌‌‌‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. 100 శాతం చెట్లు బ‌‌‌‌తికేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల‌‌‌‌పై సమీక్షించారు.

వాల్టా యాక్ట్​అమలు తీరుపై చర్చించారు. కరెంట్​తీగలు, వెహికల్స్​కు త‌‌‌‌గులుతున్నాయ‌‌‌‌ని ఒక వైపే కొమ్మల‌‌‌‌ను తొల‌‌‌‌గించ‌‌‌‌డంతో చెట్లు బ్యాలెన్స్​కోల్పోయి కూలే ప్రమాదం ఉందని, కొమ్మలు తొలగింపులో శాస్త్రీయ విధానాల‌‌‌‌ను అనుస‌‌‌‌రించాలని నిర్ణయించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ అడిషనల్ కమిషనర్ పంకజ, చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ సునంద తదితరులు పాల్గొన్నారు.

వరదలను అరికట్టాలని జేఎంఐ విజ్ఞప్తి

సిటీలో వరదల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జస్టిస్ మూవ్​మెంట్ ఆఫ్ ఇండియా(జేఎంఐ) ఆర్గనైజర్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. 15 డిమాండ్లతో ‘వరద రహిత హైదరాబాద్ కోసం సమగ్ర విధానం’ పేరుతో వినతిపత్రాన్ని ఇచ్చారు.