పల్లా అక్రమనిర్మాణాలపై హైడ్రా ఫోకస్..

హైదరాబాద్: హైడ్రా చర్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఎవరి నిర్మాణాలు ఎప్పుడు కూల్చుతారోనని అక్రమార్కుల్లో టెన్షన్ మొదలైంది.. హైడ్రా చర్యలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఫిర్యాదు అందించే ఆలస్యం బుల్డోజర్లతో ప్రత్యక్షమై అక్రమ నిర్మాణాలను నేల మట్టం చేస్తోంది.. ఓ పక్క రాజకీయంగా దుమారం రేగుతున్నా హైడ్రా తన పని చేసుకుంటూ పోతోంది..

]శనివారం సినీ హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్  కూల్చివేసింది.. దీంతో ఇప్పటివరకు అనేక అక్రమ కట్టడాలను కూల్చివేసింది.. ఇంకా అనేక అక్రమ నిర్మాణాలకు నోటీసులిచ్చింది.. తాజాగా జనగామా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ ఇనిస్టిట్యూషన్లపై ఫోకస్ చేసింది.. 

నిన్న ఎన్ కన్వెన్షన్ కూల్చి వేసిన హైడ్రా.. తాజాగా అనురాగ్ విద్యా సంస్థలపై ఫోకస్ చేసింది. నాదం చెరువు ఆక్రమించి అనురాగ్ విద్యాసంస్థలను నిర్మించారని జనగామా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు అయింది. 

ALSO READ | కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్.. నివేదికలో కీలక విషయాలు

జకీయ నేతల వాద ప్రతివాదనల మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేతను కొనసాగిస్తోంది. ఫిర్యాదు అందిందా.. అంతే..అక్రమ కట్టడాలను నేలమట్ట చేస్తోంది హైడ్రా. ఇంకా మున్ముందు రాష్ట్ర వ్యాప్తంగా చెరువులను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసేందుకు రంగం సిద్దమవుతుంది..చెరువుల ఆక్రమణ,అక్రమ నిర్మాణాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు.. హైడ్రా రాష్ట్రవ్యాప్తంగా అక్రమ  ఫోకస్ చేస్తుందనేందుకు నిదర్శనం..