హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మోనిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) అక్రమ కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. మొన్న ఎన్ కన్వెన్షన్.. నిన్న రామ్ నగర్.. ఇవాళ (శనివారం) గగన్‌పహాడ్‌లో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాల నేలమట్టం చేస్తున్నారు. శనివారం తెల్లవారుజూము నుండే అప్నా చెరువు ఎఫ్టీఎల్ పరిధిని అక్రమించి నిర్మించిన కట్టడాలను భారీ బందోబస్తు నడుమ కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రదేశంలోకి ఇతరులను ఎవరినీ అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు.
అప్పా చెరువు మొత్తం విస్తీరణం 34 ఎకరాలు కాగా.. ఇందులో 3 ఎకరాలు కబ్జా చేసి గోడౌన్లు నిర్మించినట్లు హైడ్రా అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమణలు తొలగించాలని నిర్మాణదారులను ముందుగానే హెచ్చరించినప్పటికీ వారిలో ఎటువంటి కదలిక లేకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగింది. 15 ఎకరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను నేట మట్టం చేస్తోంది.
Also Read :- తెలంగాణ ప్రభుత్వానికి సమంత విన్నపం
కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, కుంటల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ కట్టడాలను, పెద్ద భవంతులను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తోంది. ఇందులో భాగంగానే హీరో నాగార్జుకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే.