హైడ్రా ఐరన్ అమ్ముకోలే: బిల్డర్ ఆరోపణలపై కమిషనర్ రంగనాథ్ క్లారిటీ

హైడ్రా ఐరన్ అమ్ముకోలే: బిల్డర్ ఆరోపణలపై కమిషనర్ రంగనాథ్ క్లారిటీ

హైదరాబాద్: ఎర్రకుంట చెరువులో కూల్చేసిన నిర్మాణాల ఐరన్‎ను హైడ్రా అమ్ముకుందని ఓ బిల్డర్ చేసిన ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఎర్రకుంట చెరువులో అక్రమంగా నిర్మించిన భ‌వ‌నాల వ్యర్థాల‌ను తొల‌గించాల‌ని స‌ద‌రు బిల్డర్ సుధాక‌ర్ రెడ్డికి గతంలో నోటీసులు జారీ చేశాం. కానీ బిల్డర్ అక్కడ ఉన్న ఐరన్ తీసుకొని భవన నిర్మాణ వ్యర్థాలను వదిలేసి వెళ్ళాడని తెలిపారు. భవన కూల్చివేత వ్యర్థాలను ఎత్తడానికి ఎంత అయినా బిల్డరే చెల్లించాలి. పిల్లర్ల మ‌ధ్యన ఉన్న ఇనుప చువ్వల‌ను తొల‌గించి వాటిని అమ్మగా వచ్చిన డబ్బు పోను.. వ్యర్థాలు తీయడానికి అయిన ఖర్చు బిల్డర్ నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేశారు. 

Also Read :- ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్ చేస్తూ క్యాబినెట్ తీర్మానం

కొన్ని మీడియా సంస్థలు, సోష‌ల్‌ మీడియా ప‌నిక‌ట్టుకుని..  హైడ్రాపై త‌ప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కూల్చిన త‌ర్వాత ఆ వ్యర్థాల‌ను స‌ద‌రు బిల్డరే తొల‌గించాలి.. లేని ప‌క్షంలో వారిపై హైడ్రా చ‌ర్యలు తీసుకుంటుందని మరోసారి స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ అనుమ‌తులున్న భ‌వ‌నాల‌ను హైడ్రా కూల్చదన్న కమీషనర్ రంగనాథ్.. స‌ర్వే నంబ‌ర్లు మార్చేసి.. త‌ప్పడు స‌మాచారంతో అనుమ‌తులు పొంది.. భూములు, చెరువుల‌ను  ఆక్రమించి చేప‌ట్టిన‌ నిర్మాణాలపైన మాత్రమే హైడ్రా యాక్షన్ తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు.