జయభేరీకి హైడ్రా నోటీసులు... రంగలాల్ కుంట ఆక్రమణల తొలగింపుకు ఆదేశాలు..

జయభేరీకి హైడ్రా నోటీసులు... రంగలాల్ కుంట ఆక్రమణల తొలగింపుకు ఆదేశాలు..

హైదరాబాద్ వ్యాప్తంగా చెరువుల ఆక్రమణలు తొలగించి చెరువుల పరిరక్షణకు శ్రీకారం చుట్టిన హైడ్రా తన దూకుడు కంటిన్యూ చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా పలు అక్రమ కట్టడాలను కూల్చేసిన హైడ్రా తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ జయభేరికి నోటీసులు జారీ చేసింది.  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగళాల్ కుంట చెరువు ఎఫ్ టి ఎల్ మరియు బఫర్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణం సంస్థకు ఆదేశాలు జారీ చేశారు హైడ్రా అధికారులు.

భాగీరథమ్మ చెరువు ను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువు ఎఫ్టిఎల్, బఫర్ జోన్లో ఉన్న నిర్మాణ వ్యర్ధాలను వేయడంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.