హైదరాబాద్ లో ఆక్రమణలు కూల్చివేస్తున్న హైడ్రాకు మద్దతు పెరుగుతోంది. హైడ్రా పేరుతో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతించారు వరంగల్ లోని సామాజికవేత్తలు. ఫోరం బెటర్ వరంగల్ సంస్థ ఆధ్వర్యం లో హైడ్రా లాగే మనకు కావాలి వాడ్రా.. పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఇందులో ప్రొఫెసర్ వెంకట నారాయణతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వరంగల్ లో చెరువుల కబ్జాలను తొలగించాలన్నారు వక్తలు. నాళాలను పరిరక్షించాలని కోరారు. హైడ్రాకు మద్దతుగా త్వరలోనే వరంగల్ లో అన్ని వర్గాలప్రజలతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.