
హైడ్రా లోగో మారింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజన్సీ (HYDRA) లోగోను తెలంగాణ ప్రభుత్వం మార్చింది. వాటర్ వర్క్స్ సూచించేలా కొత్త లోగోను రూపొందించారు. గతంలో గ్రాన్డియర్ లుక్ లో పాత లోగోఉంది. హైడ్రకార్యాలయం.. వాహనాలు, సిబ్బంది యూనిఫాంపై కొత్త లోగో ఉంటుందని హైడ్రా అధికారులు తెలిపారు. హెచ్ అక్షరంపై నీటి బొట్టుతో హైడ్రా లోగో రూపకల్పనచేశారు.
ప్రస్తుతం ఈ కొత్త లోగోనే హైడ్రా తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ హ్యాండిల్ కు డీపీగా ఉపయోగించింది. హైదరాబాద్ నగరంలోని ప్రజలను విపత్తుల నుంచి రక్షించందుకు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థగా హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Also Read:-సమావేశానికి ఆలస్యంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల తొలగింపు