హైడ్రా మరో కీలక నిర్ణయం.. వాళ్లకు నోటీసులు

హైడ్రా మరో  కీలక నిర్ణయం.. వాళ్లకు నోటీసులు

హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్ టీఎల్,బఫర్ జోన్ లో ఇప్పటి వరకు కూల్చిన నిర్మాణాల వ్యర్థాలను తొలగించని యజమానులకు నోటీసులు ఇస్తుంది. ఈ క్రమంలో  నిజాంపేట్ లో ఎర్రకుంట చెరువు FTL పరిధిలో నిర్మించిన మూడు  5 అంతస్తుల  బిల్డింగ్స్ ను ఆగస్టు 14 న హైడ్రా కూల్చింది. అయితే నిర్మాణ వ్యర్థాలలోని ఐరన్ తీసుకొని.. ఇతర వ్యర్థాలను అక్కడే వదిలేసి వెళ్లిన  నిర్మాణ దారుడికి  హైడ్రా నోటీసులు ఇచ్చింది. 

 దీంతో ఎర్రకుంట చెరువులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది హైడ్రా. మరో రెండు రోజుల్లో వ్యర్థాలు మొత్తం తొలగిస్తామని తెలిపింది. అనంతరం ఏర్రకుంట చెరువును సుందరీకరించి పునరుజ్జీవనం కల్పిస్తామని తెలిపింది హైడ్రా. గ్రేటర్ పరిధిలో ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో చెరువులను అక్రమించి నిర్మించిన పలు నిర్మాణాలను హైడ్రా కూల్చిన సంగతి తెలిసిందే..

వాటిని కూల్చం: హైడ్రా

చట్టబద్దమైన అనుమతులున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు భయపడాల్సిన అవసరం లేదని  హైడ్రా తెలిపిన సంగతి తెలిసిందే..  చెల్లుబాటు అయ్యే అనుమతులున్న  ఎలాంటి  నిర్మాణాలను  సీఎం  కూల్చొద్దన్నారని  హైడ్రా తెలిపింది. సీఎం  ఆదేశాలకు  కట్టుబడి ఉన్నామని హైడ్రా వెల్లడించింది.

ALSO READ | కరెంట్ చార్జీలు పెంచొద్దు.. విద్యుత్ నియంత్రణ మండ‌లికి కేటీఆర్ రిక్వెస్ట్​