నిజాంపేట ఇందిరమ్మ కాలనీలో హైడ్రా ఆక్రమణల కూల్చివేత : అడ్డుకున్న స్థానికులు, ఉద్రిక్తం

నిజాంపేట ఇందిరమ్మ కాలనీలో హైడ్రా ఆక్రమణల కూల్చివేత : అడ్డుకున్న స్థానికులు, ఉద్రిక్తం

హైడ్రా అధికారులు దూకుడు పెంచారు.  బాచుపల్లి పీఎస్​ పరిధిలోని  నిజాంపేట్ ఇందిరమ్మ కాలనీ లో రోడ్లను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు ఉద్రిక్తతల మధయ  కూల్చివేశారు. భారీ పోలీసులు బందోబస్తు నడుమ ఇండ్ల ముందు  నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన  షెడ్లను కూల్చి వేశారు.  మున్సిపల్ అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు.

Also Read : మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

 గత 15 సంవత్సరాలుగా ఇందిరమ్మ కాలనీలో బతుకుతెరువు కోసం ఏర్పాటు చేసుకున్న దుకాణాలను తొలగించారని స్థానికులు  వాపోయారు. కనీసం ఖాళీ చేసే సమయం ఇవ్వకుండా కూల్చివేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఓ  టైలర్ దుకాణంలో ఉన్న సామాగ్రి మొత్తం ధ్వంసం కావడంతో సుమారు 70 వేలకు పైగా నష్టం వాటిల్లిందని నిర్వాహకులు వెల్లడించారు. పక్కనే ఉన్న కాలనీవాసులు ఇందిరమ్మ కాలనీకి సంబంధించి రోడ్డు ఆక్రమణలపైన ఫిర్యాదు చేయడంతోనే వీటిని తొలగించే వేయడం జరిగిందని హైడ్రాధికారులు పేర్కొన్నారు