- చందానగర్ సర్కిల్ఈర్ల చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- కూల్చివేతను పర్యవేక్షించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
- అక్రమ నిర్మాణాల సమాచారం ఇవ్వాలని పిలుపు
చందానగర్/గండిపేట, వెలుగు: గ్రేటర్‌పరిధిలోని చెరువులను ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాలపై ‘హైడ్రా’ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. బఫర్జోన్లు, ఎఫ్ టీఎల్పరిధిలో నిర్మిస్తున్న బిల్డింగులను కూలగొడుతున్నారు. శనివారం కూడా కూల్చివేతలు కొనసాగాయి. పోలీస్‌బందోబస్తు నడుమ బఫర్జోన్లు, ఎఫ్ టీఎల్పరిధిలోని నిర్మాణాలను కూల్చివేశారు. జీహెచ్ఎంసీ చందానగర్సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను, అధికారుల తీరును వివరిస్తూ ‘బఫర్ జోన్‌లోనూ.. పర్మిషన్లు ఇచ్చేశారు’ అనే శీర్షికన శనివారం ‘వెలుగు’లో స్టోరీ పబ్లిష్అయింది. స్పందించిన హైడ్రా కమిషనర్ఏవీ రంగనాథ్వెంటనే రంగంలోకి దిగారు.
65 మంది సిబ్బంది, డిమాలిష్వెహికల్స్తో హఫీజ్‌పేట డివిజన్వైశాలీనగర్లోని ప్లాట్‌నంబర్148, 149, 150 వద్దకు చేరుకున్నారు. నిర్మాణంలోని బిల్డింగులు ఈర్ల చెరువు బఫర్‌జోన్ పరిధిలో ఉన్నాయని తేల్చారు. ఆ వెంటనే కూల్చివేత మొదలుపెట్టారు. మియాపూర్పోలీసుల భారీ పోలీస్‌బందోబస్తు నడుమ కూల్చివేత కొనసాగింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ దగ్గరుండి కూల్చివేతను పర్యవేక్షించారు.
బఫర్‌జోన్‌లో ఇంటి నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ఆఫీసర్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైశాలీనగర్కు ఆనుకుని ఈర్ల చెరువు ఉంది. కొంత కాలంగా ఈ చెరువు బఫర్‌జోన్ ఆక్రమణకు గురవుతోంది. 148,149,150 ప్లాట్లు అలా పుట్టుకొచ్చినవే. ఇరిగేషన్అధికారులు ఎన్ఓసీ ఇవ్వకుండానే జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు బిల్డింగ్స్నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చారు. అధికారుల సహకారంతో బిల్డర్లు మూడు మూడంతస్తుల బిల్డింగ్స్నిర్మాణం చేపట్టారు. వాటిని హైడ్రా అధికారులు కూల్చివేశారు.
శివరాంపల్లిలో తెల్లవారుజాము నుంచే..
రాజేంద్రనగర్ నియోజకవర్గం శివరాంపల్లిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. ఏకంగా బమ్ రుక్నథ్ దౌల చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచి కూల్చివేయడం మొదలుపెట్టారు. స్థానిక పోలీసులు బందోస్తు కల్పించారు. చెరువులు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి చేపట్టిన ఆక్రమణలను కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైనట్లు దృష్టికి వస్తే వెంటనే 18005990099, 040-–29560509, 040-–29560596, 040–-29565758, 040–-295605935కు కాల్చేసి చెప్పాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే తనను వ్యక్తిగతంగా కలిసేందుకు 72079 23085 నంబర్‌కు మెసేజ్ చేయాలని సూచించారు.
స్థలాలు, ఫ్లాట్లు కొనే ముందు జాగ్రత్త
చెరువులను ఆక్రమించి కడుతున్న బిల్డింగ్స్ సమాచారాన్ని మాకు ఇవ్వండి ఆక్రమణలపై ప్రజలతోపాటు స్వచ్ఛంద సంస్థలు స్పందించాలి.చెరువుల సమీపంలో స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా చెరువు పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్లు లభిస్తున్నాయంటే క్రాస్‌చెక్ చేసుకోవాలి. చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉందో.. లేదో చూసుకోవాలి. సమాచారం కోసం హైడ్రా ఆఫీసులో సంప్రదించండి. ప్రజలను అప్రమత్తం చేసేలా హైడ్రా వెబ్సైట్లో త్వరలో పూర్తి సమాచారాన్ని ఉంచుతాం.
- ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్