మాదాపూర్, మల్లంపేట్‌లో విల్లాలు, షెడ్లు మటాష్ : హైడ్రా కూల్చివేతలు.. తగ్గేదే లేదు

మాదాపూర్, మల్లంపేట్‌లో విల్లాలు, షెడ్లు మటాష్ : హైడ్రా కూల్చివేతలు.. తగ్గేదే లేదు

తెలంగాణలో హైడ్రా అధికారుల దూకుడు ఆగటం లేదు.. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పరంపరా కొనసాగుతుంది. సెప్టెంబర్ 8 (ఆదివారం) ఉదయం హైడ్రా అధికారులు భారీ బంధోబస్తుతో పలు చోట్ల కూల్చివేతలు ప్రారంభించారు. మాదాపూర్ సున్నం చెరువు, మల్లంపేట్ కత్వ చెరువులో  అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు విరుచుకుపడ్డారు. 2023లో చేసిన సర్వే ప్రకారం సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26  ఎకరాలు, ఫుల్ ట్యాంక్ లెవల్(FTL) 15 ఎకరాల 23 గుంటలు. చెరువు FTL, బఫర్ జోన్ లలో పదుల సంఖ్యలో అక్రమంగా షెడ్లు నిర్మించారు. సర్వే నంబర్లు 12,13,14,16 ల్లో ఉన్న కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు.

Also Read :- అనితక్కా... ఏందిదీ

దుండిగల్ మున్సిపాలిటీ పరిదిలోని కత్వ చెరువులో 170/1సర్వే నెంబర్‌లో వెలిసిన 8విల్లాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. ఈ చెరువు ఎఫ్టిఎల్ విస్తీర్ణం 142 ఎకరాలు. మల్లంపేట్ లో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరుతో 2020-,21 సంవత్సరాల్లో 320 విల్లాస్ లను నిర్మించింది. అప్పటికి 60 విల్లాలకు మాత్రమే HMDA పర్మిషన్ తీసుకుంది. మిగతావన్నింటిని పోర్జరీ పర్మిషన్ తో ఈ సంస్థ కట్టిందని అప్పటి మేడ్చల్ కలెక్టర్ హరీష్  ఎంక్వైరీ చేసి 208 విల్లాలకు నోటీసులు జారీచేసి సీజ్ చేశారు. హై కోర్ట్ ఆదేశాలతో ఈ అక్రమవిల్లాలకు కరెంట్ కనెక్షన్,వాటర్ కనెక్షన్,రిజిస్ట్రేషన్ లను ఆపాలని,బ్యాంక్ అధికారులు లోన్ లను నిలిపివెయ్యాలని ఆర్డినెన్స్ జారీచేశారు.