గ్రేటర్లో హైడ్రా పంజా.. కొనసాగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేత

గ్రేటర్లో హైడ్రా పంజా.. కొనసాగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేత

గ్రేటర్  హైదరాబాద్  పరిధిలో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చందానగర్ పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.  వైశాలినగర్ లోని FTL ల్యాండ్ లో మూడు అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా... భారీ బిల్డింగ్ లను JCBలతో నేలమట్టం చేస్తోంది.

ఆగస్టు 10 ఉదయం నుంచి మొదలైన కూల్చివేతలు..ఇవాళ సైతం కొనసాగుతున్నాయి. కూల్చివేత టైమ్ లో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.