హైదరాబాద్: గండిపేటలో అక్రమ నిర్మాణాల పై ఇవాళ తెల్లవామున నుంచి హైడ్రా ఉక్కుపా దం మోపుతోంది. ఖానాపూర్లో అక్రమంగా వెలసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. 10 ఎకరాల్లో అక్రమంగా నిర్మించిన ORO స్పోర్ట్స్ విలేజీని హైడ్రా అధికారులు కూల్చివేశారు.
ఎలాంటి అనుమతులు లేకుండా యజమానులు వ్యాపార సముదాయాలను నిర్మించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలో అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అడ్డుగా వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.