గ్రేటర్​ చెరువులకు లింకులు ఉండాలి : కమిషనర్​ రంగనాథ్

గ్రేటర్​ చెరువులకు లింకులు ఉండాలి : కమిషనర్​ రంగనాథ్
  • గొలుసుకట్టు చెరువుల లింకులను పునరుద్ధరించాలి
  • హైడ్రా ఆఫీసులో డిజాస్టర్​ మేనేజ్​మెంట్​పై కమిషనర్​ రంగనాథ్​సమీక్ష

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​చెరువులన్నింటికీ అలుగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించాలని, నాలాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. బుధవారం హైడ్రా ఆఫీసులో కమిషనర్​ఏవీ రంగనాథ్ డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్‌‌పై సమీక్ష నిర్వహించారు. గొలుసుకట్టు చెరువుల లింకులను పున‌‌రుద్ధరిస్తే వరదనీరు సాఫీగా వెళ్లేందుకు వీలు ఉంటుందని రంగనాథ్​చెప్పారు. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.

బెంగ‌‌ళూరులో అనుస‌‌రిస్తున్న విధానాలను క‌‌ర్ణాట‌‌క రాష్ట్ర ప్రకృతి వైప‌‌రీత్యాల నిర్వహ‌‌ణ కేంద్రం మాజీ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ శ్రీ‌‌నివాస్ రెడ్డి పవర్​పాయింట్​ప్రజెంటేషన్​ద్వారా వివరించారు. డిజాస్టర్​మేనేజ్​మెంట్​పై బెంగ‌‌ళూరుతోపాటు దేశంలోని ఇత‌‌ర ప‌‌ట్టణాల్లో అనుస‌‌రిస్తున్న విధానాల‌‌ను అధ్యయ‌‌నం చేసి మెరుగైన వ్యవ‌‌స్థను రూపొందించాల్సి అవసరం ఉందని కమిషనర్​రంగనాథ్​చెప్పారు.

వానలు, వరదల టైంలో ప్రజలను అలర్ట్​చేయడం, గాలి కాలుష్యం, ఎప్పటికప్పుడు వర్షపాతం వివరాలు, త‌‌లెత్తుతున్న ఇబ్బందులు, తెలియజేసేలా చర్యలు ఉండాలన్నారు. అలాగే ముంపు ప్రాంతాల్లోని వరద నీటికాల్వల్లో ప్రవాహ స్థాయిని అంచ‌‌నా వేసేందుకు బెంగ‌‌ళూరులో అమ‌‌ర్చిన సెన్సార్ల ప్రయోజ‌‌నాల‌‌పై స‌‌మీక్షించారు.