- హయత్ నగర్లోని నిర్మాణాలను పరిశీలించిన అధికారులు
ఎల్బీనగర్, వెలుగు: హయత్ నగర్ ఆఫీసర్స్ కాలనీలో నిర్మాణంలో ఉన్న రెండు బిల్డింగ్స్ను హైడ్రా అధికారులు శుక్రవారం పరిశీలించారు. సదరు నిర్మాణాలు హైడ్రా పరిధిలో ఉన్నాయని చెప్పారు. ఇల్లు కొనే ముందు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. లీగల్సమస్యలు రాకుండా చూసుకోవాలని తెలిపారు.
ఆఫీసర్స్ కాలనీలోని లేఅవుట్ ఓపెన్ ల్యాండ్(పార్క్ స్థలం) కబ్జాకు గురి అవుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో నెల కింద హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పరిశీలించారు. ఓపెన్ ల్యాండ్లో జరుగుతున్న నిర్మాణాలను ఆపాలని ఆదేశించారు. అయితే నిర్మాణాలు ఆగలేదు. తాజాగా ఇండ్లు పూర్తికాక ముందే ప్లాట్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టడంతో కాలనీవాసులు మరోసారి హైడ్రాను ఆశ్రయించారు. దీంతో హైడ్రా అధికారులు శుక్రవారం నిర్మాణాలను పరిశీలించారు.