గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లను ఆక్రమించి కట్టిన షాపులు, షెడ్లను శనివారం హైడ్రా అధికారులు తొలగించారు. GHMC అధికారులతో కలిసి ఫిల్మ్ నగర్ లోని ఆక్రమణలను హైడ్రా జేసీబీతో కూల్చివేసింది. ఫిలింనగర్ లో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై స్థానికుల ఫిర్యాదు చేశారు. దీంతో ఫిలింనగర్ లోని లేఅవుట్ ను హైడ్రా అధికారుల పరిశీలించారు.
ALSO READ : ఇండ్లకు స్టిక్కరింగ్కంప్లీట్..నవంబర్ 21 వరకు రెండోదశ సమగ్ర కుటుంబ సర్వే
రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్టు GHMC అధికారులు గుర్తించారు. ఇంటి ప్రహారీ గోడ, రేకుల షెడ్డును జీహెచ్ఎసీ, హైడ్రా అధికారులు కూల్చివేశారు. కూల్చివేతల వెంటనే అక్కడ శిథిలాను తొలగించారు. GHMC ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ శ్రీ అనురాగ్ జయంతితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడి.. వెంటనే ఆ ప్లేస్ లో రోడ్డు నిర్మించాలని కోరారు.